బ్రేకింగ్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణి మళ్లీ అరెస్ట్

-

ఈఎస్ఐ స్కామ్ లో మరో సారి మాజీ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరందరినీ ఈ సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. 6.5 కోట్ల అక్రమాలు జరిగాయని నిన్న ఏసీబీ గుర్తించింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో భారీ ఎత్తున అక్రమాలు జరిగ్యాని గుర్తించింది ఏసీబీ. దీంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు, ఈ స్కామ్ లో మరికొంత మంది మీద కూడా కేసు నమోదయినట్టు తెలుస్తోంది.

కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. నకిలీ ఇండెన్స్, ఎక్కవగా కోట్ చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలు చేసినట్టు గుర్తించారు. అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నిందితులు నష్టం చేకూర్చినట్టు గుర్తించారు. ఈ దందాలో ఓమ్ని మేడి యజమాని శ్రీహరి బాబు కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. షెల్ కంపెనీలు సృష్టించి తన కంపెనీలకు నకిలీ డిస్ట్రిబ్యూటర్ల పాత్ర కల్పించిన శ్రీహరి, తనతో పాటు, తన భార్య పేరు మీద, తన అనుచరుల పేరు మీద కూడా షెల్ కంపెనీలు సృష్టించారు. ఆపరేషన్ థియేటర్ లో ఉపయోగించే ‘”హేమోక్యూ హెచ్ బీ క్యువెట్స్” పరికరాల డిస్ట్రిబ్యూషన్ లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news