భార‌త ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం, ప‌బ్‌జి మ‌ళ్లీ వ‌స్తుంది: టెన్సెంట్ హోల్డింగ్స్

-

పాపుల‌ర్ మొబైల్ గేమ్ ప‌బ్‌జి ని భార‌త ప్ర‌భుత్వం బ్యాన్ చేయ‌డంతో ఆ గేమ్‌ను ప‌బ్లిష్ చేసిన చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ స్పందించింది. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం తాము దృష్టి సారించామ‌ని తెలిపింది. ప‌బ్‌జి గేమ్‌ను ఆడే యూజ‌ర్ల ప్రైవ‌సీ, డేటాకు 100 శాతం ర‌క్ష‌ణ ఉంటుందని తెలిపింది. ఇదే విష‌య‌మై తాము భార‌త ప్ర‌భుత్వ అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని తెలియ‌జేసింది.

will discuss matter with indian government pubg may return says tencent games

ప‌బ్‌జి బ్యాన్‌పై సంబంధిత మంత్రిత్వ శాఖ‌, అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఆ గేమ్ ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చే య‌త్నం చేస్తామ‌ని టెన్సెంట్ హోల్డింగ్స్ తెలిపింది. అయితే ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు సంబంధించి డెవ‌ల‌ప‌ర్ కంపెనీ బ్లూ హూల్‌తో టెన్సెంట్ హోల్డింగ్స్ భాగ‌స్వామ్యం అయినందున ఇప్పుడు ప‌బ్‌జి ఫ్యాన్స్ ఆ పార్ట్‌న‌ర్ షిప్ నుంచి టెన్సెంట్ హోల్డింగ్స్ వైదొల‌గాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప‌బ్‌జి గేమ్ మ‌ళ్లీ రిట‌ర్న్ అవుతుంద‌ని అంటున్నారు.

కాగా ప‌బ్‌జి గేమ్‌ను బ్యాన్ చేసిన వెంట‌నే టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన షేర్లు 2 శాతం ప‌డిపోయాయి. అలాగే ఆ కంపెనీ మార్కెట్ విలువ భారీగా త‌గ్గింది. ప‌బ్‌జి మొబైల్ గేమ్‌కు భార‌త్ అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న నేప‌థ్యంలో ఈ గేమ్‌ను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల ఆ కంపెనీకి తీవ్ర‌మైన న‌ష్టం క‌ల‌గ‌నుంది. అయితే టెన్సెంట్ హోల్డింగ్స్ ఈ విష‌యంలో ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news