ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని కంపెనీపై రివేంజ్.. రూ.44 కోట్ల మేర న‌ష్టం..

-

సాధార‌ణంగా కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం స‌హ‌జ‌మే. కొన్ని సార్లు యాజ‌మాన్యాలు ఏవో సాకులు చెప్పి ఉద్యోగుల‌ను తొల‌గిస్తుంటాయి. ఇక కొన్ని సంస్థ‌లు అయితే కార‌ణం ఏమీ చెప్ప‌కుండా, క‌నీసం సంజాయిషీ ఇచ్చుకునే అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా.. ఉద్యోగుల‌ను రాత్రికి రాత్రే తొల‌గిస్తుంటాయి. అయితే అలా ఉద్యోగం నుంచి గెంటివేయ‌బ‌డ్డ వారు ఇంకో ఉద్యోగంలో చేర‌డ‌మో, స్వ‌యం ఉపాధి చేసుకోవ‌డ‌మో చేస్తుంటారు, కానీ ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీని ఏమీ అన‌రు. అయితే ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. తాను ఒకప్పుడు ప‌నిచేసిన కంపెనీపై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

former employee of mercedes company got revenge for firing him

స్పెయిన్‌లోని మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్‌లో ఓ వ్య‌క్తి 2016-17 మ‌ధ్య కాలంలో ప‌నిచేశాడు. కానీ అత‌న్ని ఉద్యోగం నుంచి అప్ప‌ట్లో తొల‌గించారు. దీంతో అప్పుడు అత‌ను ఏమీ చేయ‌లేదు. కానీ 3 ఏళ్ల త‌రువాత ఇప్పుడు త‌న‌ను ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీపై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. ఒక పెద్ద బుల్‌డోజ‌ర్‌ను తెచ్చి కంపెనీ బ‌య‌ట పార్క్ చేసి ఉన్న కొత్త మెర్సిడిస్ బెంజ్ కార్లు, వ్యాన్ల‌ను ధ్వంసం చేశాడు. దీంతో మొత్తం 69 వాహ‌నాలు నాశ‌న‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆ ప‌రిశ్ర‌మ‌కు దాదాపుగా రూ.44 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లింది.

అయితే ప‌రిశ్ర‌మ ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత‌న్ని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. ఈ సంఘ‌ట‌న డిసెంబ‌ర్ 31వ తేదీన చోటు చేసుకుంది. అయితే అదే స‌మ‌యంలో అక్క‌డ కాపలాగా ఉన్న సెక్యూరిటీ వారించారు. అయినా అత‌ను విన‌కుండా కార్ల‌ను నామ‌రూపాల్లేకుండా ధ్వంసం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news