మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసే ఈ పది విషయాలకి తక్షణమే దూరం కండి..

-

జీవితంలో ఎదగడానికి కృషి చేసే ప్రతీ ఒక్కరికీ ఆరు వెళ్తున్న దారిలో చాలా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆ అడ్డంకులని దాటుకుని ముందుకు వెళితేనే జీవితంలో అనుకున్నదు సాధించగలుగుతారు. ఆ అడ్డంకులనేవి వేరే ఎవరో సృష్టించినవే ఉండకపోవచ్చు. ఒక్కోసారి మీ జీవితానికి అడ్డంగా మీరే పెద్ద పెద్ద బండరాళ్ళని నిలబెట్టుకుంటారు. ఆ బండరాళ్ళని దాటి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ పెద్ద బండరాళ్ళు ఏంటో, వాటిని దూరం చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ చూద్దాం.

ఎక్కువ ఆలోచించవద్దు

ఒక విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఒక సంఘటన జరిగినపుడూ దాన్ని పెద్దగా ఊహించేసుకుని మనసు పాడుచేసుకుని మీరనుకున్న విషయాన్ని మర్చిపోయే పరిస్థితికి వస్తారు. అందుకే గతం గురించి, భవిష్యత్ గురించి ఎక్కువ ఆలోచించవద్దు. అవి రెండూ మన చేతుల్లో లేవు కాబట్టి, మనం ఏమీ చేయలేము.

ఇతరులతో పోల్చుకోవద్దు. వేరే వాళ్ళు పోల్చిన ఊరుకోకండి. వారు వేరు, మీరు వేరు. వాళ్ళకి ఉన్న పరిస్థితులు వేరు, మీకున్న పరిస్థితులు వేరు. అవతలి వారి నుండి ఉత్సాహం తెచ్చుకుని అది మీలో నింపుకుంటే బాగానే ఉంటుంది గానీ, వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకుని నిరాశకి గురి కావద్దు.

మీకు తెలియని వ్యక్తులని అతిగా నమ్మకండి. ఎవరెలాంటి వారనేది అంత త్వరగా తెలిసే అవకాశం లేదు. కాబట్టి, వారిని నమ్మి మీ గురించి అన్ని విషయాలు చెప్పవద్దు.

స్నేహితులుగా ఉంటూ మీ గురించి చెడు ప్రచారం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళు స్నేహితులు కాదు. మీ ఎదుగుదలకి అడ్డుపడే వారు. వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వాళ్ళని తొందరగా గుర్తించాలి.

మీ నమ్మకాన్ని తప్పని, చెప్పే వారితో వాదించకండి. వాదన అనేది ఒక పరిధి వరకు బాగానే ఉంటుంది. ఆ పరిధి దాటుతుందని మీకనిపిస్తే, ఆ టాపిక్ ఆపేయండి. ఎందుకంటే అవతలి వారు వారిది చెప్పడానికే ఉన్నారు కానీ, మీరు చెప్పేది వినడానికి కాదు.

Read more RELATED
Recommended to you

Latest news