మరో కేసులో దోషిగా హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్

-

2000 సంవత్సరంలో 3206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా పదేళ్ల జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే విడుదలయ్యారు. ఈ కేసులో చౌతాలా అతని కుమారుడు అజయ్ చౌతాలా ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2013లో చౌతాలా అరెస్టయ్యారు.

అయితే తాజాగా.. ఓం ప్రకాష్ చౌతాలా మరో కేసులో దోషిగా తేలారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఆరోపణలపై చౌతాలాపై గతంలోనే కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోరుతూ శనివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏ తరహా శిక్ష విధించాలన్న విషయంపై కోర్టు ఈనెల 26న చేపట్టనున్న విచారణలో నిర్ణయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version