అధికార టీఆర్‌ఎస్ పార్టీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి చెందారు. కాసేపటి క్రితమే… టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్… హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో మరణించారు.
గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యం తో బాధ పడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్… కాసేపటి క్రితమే… తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జహీరాబాద్ నియోజక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఫరీదుద్దీన్… 2016 సంవత్సరంలో.. ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత… ఆయనకు మరోమారు ఎమ్మెల్సీ గా ఛాన్స్ ఇవ్వలేదు సీఎం కేసీఆర్. అలాగే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో… మైనారిటీ శాఖ మంత్రి గా కూడా మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పనిచేశారు. రాష్ట్రం విడిపోయాక నేరుగా టీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు ఫరీదుద్దీన్. ఇక మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి పట్ల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.