రిషబ్ పంత్ అధిక బరువుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంట్

-

సౌతాఫ్రికాతో భారత జట్టు ఐదు టి-20 ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ పనితీరుపై పాకిస్థాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా స్పందించాడు.పంత్ వికెట్ కీపింగ్ లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రస్తావించాడు. అధిక బరువు వల్ల వికెట్ల వెనుక పంత్ పెద్దగా వంగి ఉండలేకపోతున్నాడని చెప్పాడు.” పంత్ వికెట్ కీపింగ్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఒకటి గుర్తించాను. ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో పంత్ చతికిలపడి పాదాలను వంచి కూర్చోలేకపోతున్నాడు.

అతడు అధిక బరువుతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అంత బల్కిగా ఉండడంతో వేగంగా స్పందించలేకపోతున్నాడు. ఇది అతడి ఫిట్నెస్ పై ఆందోళనను కలిగిస్తోంది. అతడు 100% ఫీట్ గా ఉన్నాడా? కానీ పంత్ కెప్టెన్సీ విషయానికి వచ్చేసరికి అతడికి పాండ్యా, కార్తిక్ సహా అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ ను గెలిచిన తొలి కెప్టెన్ గా గుర్తింపు పొందే అవకాశం రిషబ్ పంత్ ముందు ఉంది.” అని కనేరియా వివరించాడు. నాలుగో టి-20 మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసిన దినేష్ కార్తీక్ ను కనేరియా మెచ్చుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news