మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత…!

-

తెలంగాణ రాష్ట్ర తొలిహోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(86) కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానినుంచి కోలుకున్నా ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షెన్ సోకింది. చికిత్సలో భాగంగా ఇక్కడి వైద్యులు గుండె ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు. అయినా ఆరోగ్యం బాగుపడకపోవడంతో.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు.

తెలంగాణ తొలి హోం మంత్రిగా నాయిని సేవలందించారు. 1978లో జనతాపార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అటు కార్మిక రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ నాయిని నర్సింహారెడ్డి రాణించి రాష్ట్రంలో తనదైనముద్ర వేసుకున్నారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి రాం నగర్ కార్పోరేటర్ గా ఉన్నారు. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news