కరోనా ఉగ్రరూపం.. మాజీ మంత్రి మృతి..!

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎవరికీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని, సీఎంలతో సహా అనేక మంది ప్రముఖులు చెప్తున్నారు. అయినాసరే సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా.. కరోనా వైరస్ కారణంగా యూపీ మాజీ మంత్రి, ఎస్పీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు.

కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారు జామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఘూరా రామ్ 1993, 2002, 2007 ఎన్నికల్లో రాస్రా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.