క్రేజీ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌.. దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో

-

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు భాగ్యనగరం వైపు దేశమంతా తిరిగి చూస్తోంది. అయితే ఇప్పుడు మరో క్రేజీ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. ఫార్ములా ఈకి స్వాగతం అంటూ హ్యాపెనింగ్ హైదరాబాద్ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ‘ఫార్ములా ఈ’ సీఈవో హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయనతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ రేసు ఆతిథ్యం హైదరాబాద్ కు దక్కేలా కేటాయించేలా మంత్రి కేటీఆర్ కృషి చేశారు. దేశంలో జరిగే మొదటి ‘ఈ-రేస్’ కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది.

Hyderabad signs letter of intent to host ABB FIA Formula E World  Championship | FIA Formula E

2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభత్వం ఏర్పాట్లు చేయనుంది. విద్యుత్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ‘ఫార్ములా ఈ’ సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా1 మాదిరిగా ‘ఈ–రేస్‌’కు ప్రత్యేక ట్రాక్‌ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్‌ నిర్వహిస్తారు. 2014–15లో ఈ పోటీలు మొదలయ్యాయి. భారత్ నుంచి మహింద్రా కంపెనీకి చెందిన ‘మహింద్ర రేసింగ్‌’జట్టు పోటీ పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news