హైదరాబాద్.. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు భాగ్యనగరానికి వస్తారు..ఏదో ఒక జాబ్ దొరుకుతుందనే ఆశ..ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎన్నో జీవితాల్లో వెలుగును నింపుతుంది. కల్చర్ మార్చేస్తుంది. కలర్ ఫుల్ గా లైప్ మారిపోతుంది.సాఫ్ట్ వేర్లతో హైట్ కే సిటీ బిజీబిజీ.. స్టూడెంట్స్ తో బస్సులు ఫుల్..మహిళలతో మెట్రో సీట్లు ఫుల్..కపిల్స్ తో సినిమా హాళ్లు ఇలా కలర్ ఫుల్ గా ఉండే భాగ్యనగరమే సినిమా ఘూటింగ్స్ కూడా బెస్ట్ అట.
సినిమా షూటింగ్ అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు.. వందల మంది ఒకే చోట పని చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో అంత మంది కలిసి పనిచేయాలంటే అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా కావాలి. మరి అలాంటి ఏర్పాట్లన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని సినీ పరిశ్రమలో టాక్.
సినిమా హబ్‌గా మారుతున్న భాగ్యనగరం షూటింగ్‌లకు బెస్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేసుకుంటుంది. అందుకే బిగ్ బడ్జెట్ హిందీ సినిమాల మేకర్స్ కూడా షూటింగ్‌ల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారట. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలు సౌకర్యాల పరంగా ముందుండమే కాదు. స్పేషియస్‌గా ఉండటం కూడా ప్లస్ అవుతోంది. అందుకే బిగ్ స్టార్స్‌తో సినిమాలు చేయటం హైదరాబాద్ లో చాలా ఈజీ అని మేకర్స్ అనుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే మేడిన్ హైదరాబాద్ అన్న ట్యాగ్ ఎప్పుడో పడిపోయింది. అలాంటి సినిమాల కోసమే.. అజయ్ దేవగన్, కంగనా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కేజీఎఫ్ షూట్ కోసం మరో వారంలో సంజయ్ దత్ కూడా వచ్చేస్తున్నారుమన వాళ్లు కూడా ఘూటింగ్ లకు బెస్ట్ ప్లేస్ హైదరాబాదే అని ఫిక్స్ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రెగ్యూలర్ ఘూటింగ్స్ అన్నీ హైదరబాద్ లో చేయటానికి ఇష్టపడుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూడా వలిమై షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే జరుగుతుంది. లేటెస్ట్‌గా యష్ కూడా కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం హైదరాబాద్లో అడుగు పెట్టేశారు. ఇలా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా స్టార్స్ అంతా సినిమా మేకింగ్ హైదరబాద్ వైపే చూస్తున్నారు… టాప్ సిటీ ఫర్ లివింగ్ గా పేరు ఉన్న హైదరాబాద్ ఇప్పుడు బెస్ట్ ఫర్ షూటింగ్ గా కూడా మారిపోతుంది.