ఏపిలో దారుణం : వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం జాలంపల్లి వద్ద పెద్దేరు వాగులో పడి ఏకంగా నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. అయితే.. గల్లంతైన కాసేపటికే ఆ వాగులో ఆ నలుగురు చిన్నారుల మృత దేహాలు నీటిపై తేలాయి. బట్టలు ఉతికేందుకు వారి పెద్దలతో పాటు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్ద రేవు ఊబిలో చిక్కుకున్నారు చిన్నారులు.

ఈ నేపథ్యంలో ఆ వాగులో శవాలై తేలారు. ఇక ఈ చిన్నారులంతా గిరిజన కుటుంబాలకు చెందిన వారు. గల్లంతైన వారిలో నీలాపు మహేందర్‌ 7, వంత్తాల వెంకట ఝాన్సీ 10, వంత్తాల షర్మిల 7, వంత్తాల ఝహ్నవి 11 సంవత్సరాలు ఉన్నారు. అయితే.. మృతి చెందిన వారిలో ముగ్గురు ఆడ పిల్లలే కావడం గమనార్హం. నలుగురు చిన్నారులు మృతి చెందటం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.