కరోనా వైరస్ జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటి వరకూ అతి తక్కువ గా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి నెమ్మదిగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ తన ఉనికి చూపిస్తుంది. తాజాగా దీనిపై తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మీడియాతో మాట్లాడారు. తెలంగాణా గడ్డ మీద ఎవరికి కరోనా లేదని అన్నారు.
ప్రస్తుతం నలుగురికి ఈ వైరస్ సోకగా ఒకరు ఖమ్మం, ఇద్దరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా ఒకరు విదేశీయుడని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే అన్ని మార్గాల్లో కూడా కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికీ ఎయిర్ పోర్టులో 66 వేల మంది టెస్టులు చేశామని, కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారిని గాంధీ ఆసుపత్రి కి తరలిస్తున్నామని మంత్రి ఈటెల మీడియా తో అన్నారు.
గాంధీ ఆసుపత్రి లో పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా వచ్చిందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఒక్క మహారాష్ట్రలోనే 40 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.