ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి కొత్త గా నలుగురు

-

హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఐసీసీ కొత్త గా న‌లుగురు ఆట‌గాళ్ల‌ను చేర్చింది. శ్రీ లంక మాజీ ఆట‌గాడు మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే తో పాటు కూమార సంగ‌క్క‌ర‌, ద‌క్షిణాఫ్రీకా మాజీ ఆట‌గాడు షాన్ పొలాక్ తో పాటు ఇంగ్లాండ్ మాజీ ప్లేయ‌ర్ జానెట్ బ్రిటిన్ ల‌ను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చారు. శ్రీ లంక ఆట‌గాడు మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే 650 మ్యాచ్ లు ఆడాడు.

మొత్తం 25,000 కు పైగా ప‌రుగులను మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే చేశాడు. అలాగే మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే శ్రీ లంక కు 1997 నుంచి 2015 వ‌ర‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అలాగే కుమార సంగ‌క్క‌ర శ్రీ లంక జ‌ట్టు కు 2000 సంవ‌త్స‌రం నుంచి 2015 వ‌ర‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. కుమార సంగ‌క్క‌ర నేతృత్వం లోని శ్రీ లంక జ‌ట్టు కు చాలా విజ‌యాల‌ను అందించాడు.

 

అలాగే ద‌క్షిణాఫ్రీకా మాజీ షాన్ పొలాక్ 108 టెస్టు లు ఆడి 421 వికెట్ల ను తీశాడు. అలాగే 303 వ‌న్డే లు అడి 393 వికెట్లు తీశాడు. అలాగే 7300 పైగా ప‌రుగుల కూడా చేశాడు. అలాగే షాన్ పొలాక్ సౌత్ ఆఫ్రికా త‌ర‌పున 1995 నుంచి 2008 వ‌ర‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్లేయ‌ర్ జానెట్ బ్రిటిన్ 19 సంవ‌త్స‌రాల పాటు టెస్టు క్రికెట్ ఆడింది. అలాగే మొత్తం 10 సెంచ‌రీలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news