TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితుల నాలుగో రోజు కస్టడీ విచారణ

-

TSPSC పేపర్ లీకేజ్ కేసులో నిందితుల నాలుగో రోజు కస్టడీ విచారణ జరుగనుంది. మరికాసేపట్లో హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీస్ లో 9మంది నిందితుల విచారణ మొదలు కానుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ని ఎవరెవరికి ఇచ్చారనే దానిపై సిట్ విచారణ జరుపనుంది. నలుగురు ఎన్ అర్ ఐ లు వచ్చి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసారని గుర్తింపు, వారిని ఫోన్ లో విచారించిన సిట్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు పైగా వచ్చిన వారి లిస్ట్ తీసుకుంది.

ప్రవీణ్ కి తెలియకుండా రేణుక మరికొంత మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. TSPSC పేపర్ తీసుకున్న వారిని గుర్తించి, వారిపైన కేసులు పెట్టనున్న సిట్..రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి వెళ్లనుంది. సిస్టమ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ పై విచారణ జరుగనుంది. అక్టోబర్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ లీక్ అయాయ ? సిట్ విచారణ చేయనుంది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సిట్ సోదాలు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాగుతున్న దర్యాప్తు విచారణ జరుపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news