చాలా ఏళ్ళ తరువాత ఫోక్స్ సాగర్ చెరువు నిండింది. అయితే ఫోక్స్ సాగర్ చెరువుకు అధికారులు గండి కొట్టారు. ముందు గేట్‌వాల్ తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా గేట్ వాల్స్ తెరవలేకపోయారు సాగర్ ఇంజినీర్లు. మరో పక్క అటు వర్షాలతో ఒక్క సారిగా వరద పెరిగి పోయింది. అధికారులు గండి కొట్టారు.
ఇప్పటికే వరదనీటికి కుత్బుల్లాపూర్ పరిధిలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముంపు గ్రామాల్లో సీపీ సజ్జనార్, అధికారులు పర్యటించారు. ఇక మరో సారి మూసీ నదికి ముంపు పొంచి ఉందని హెచ్చరించారు అధికారులు. మరో వైపు ఉస్మాన్ సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. 1789 అడుగులకు నీటిమట్టం చేరగానే గేట్లు ఎత్తివేస్తామని ప్రకటించారు అధికారులు. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దిగువ ప్రాంతాల్లో దప్పులు కొట్టించి చాటింపు వేశారు.