కేంద్ర ప్రభుత్వం దసరా పండుగకు ఉద్యోగులకు తీపి కబురందించింది. 2019-2020 సంవత్సరానికి ప్రొడక్టివిటీ, నాన్‌ప్రొడక్టివిటీ రూపంలో ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పుంది. బోనస్ ప్రకటన వల్ల సుమారు 30 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 3,737 కోట్ల భారం పడనున్నట్లు ఆయన తెలిపారు. బోనస్‌ను సింగిల్ ఇన్‌స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వనున్నారు.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన కేంద్ర మంత్రి జవదేకర్. జమ్మూకశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టాన్ని ఆమోదించినట్లు చెప్పారు. ఈ చట్టం వల్ల ఇతర రాష్ట్రాల తరహాలో కశ్మీర్‌లోనూ ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందన్నారు. రైల్వే, పోస్టల్, ఈపీఎఫ్‌వో లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులకు వారంలోగా బోనస్ అందిచనున్నారు.