క్రిప్టో కరెన్సీ పేరుతో ఘరానా మోసం..ముగ్గురు అరెస్ట్‌

-

హైదరాబాద్‌ లో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ పేరు తో మోసాలు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొని వచ్చారు పోలీసులు. ఆన్ లైన్ లో క్రిప్టోకరెన్సీ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు అని ప్రచారం సాగిస్తున్నారు.

18 షెల్ కంపెనీల ద్వారా క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. నారపల్లి కి చెందిన ఒకరి దగ్గర నుంచి 85 లక్షల రూపాయలు కొట్టేశారు మోసగాళ్లు. ఈ షెల్‌ కంపెనీ ల ద్వారా మోసాల పాల్పడింది ఈ దొంగల ముఠా. Bitzium టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌, కార్గో సొల్యూషన్స్, కర్వ్డ్ హార్ ప్రొడక్షన్స్, హార్చ్ అరన్ ఎంటర్‌ప్రైజెస్, QUIKO M సమాచారం TEC, స్కై డెస్టినేషన్స్ ప్రయాణం, ఇంట్రా ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్ ఫనిగో కన్సల్టెన్సీ ప్రి, మహాదేవి ఎంటర్‌ప్రిస్, ఫతే వస్త్రాలు, AWLENCAN, VA నుండి MDIJARUL, విండ్‌బెర్రీ, BISFUL TEC లాంటి కంపెనీల పేర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news