ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌..వారంద‌రికీ ఉచితంగా భూములు !

-

ఏపీలోని పేద‌ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. ఏపీ లోని ప్రైవేట్ లే ఔట్ల నిర్మాణంలో.. క‌చ్చితంగా పేదల ఇళ్ల కు ఐదు శాతం భూమి ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ లే ఔట్ల నిర్మిస్తే ఐదు శాతం భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ మేర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్మించే లే ఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. 3 కిలో మీటర్ల పరిధిలో అంతే విస్తీరణం కల భూమిని ప్రభుత్వానికి అప్ప జెప్పాలని ఆదేశాలు జారీ చేసింది జ‌గ‌న్ స‌ర్కార్‌. భూమి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో భూమి విలువను చెల్లించవచ్చని ప్రభుత్వం సూచనలు చేసింది. లే ఔట్ల డెవలపర్ల ద్వారా వచ్చే భూమిని.. నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్టు వెల్లడించి ప్ర‌భుత్వం. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news