దేశంలో మరోసారి కరోనా మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు ఓమిక్రాన్ కేసులు నెమ్మదిగా ఇండియాలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 23 కేసులను అధికారికంగా గుర్తించారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఈ వేరియంట్ ఉండటంతో అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరోసారి థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు అంచానా వేస్తున్నారు.
తాజాగా ఫిబ్రవరిలో భారత్ లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. కరోనావైరస్ యొక్క మూడవ వేవ్ ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, దేశంలో రోజుకు 1-1.5 లక్షల కేసులు చేరే అవకాశం ఉందని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. అయితే ఫిబ్రవరిలో మూడో వేవ్ తప్పకపోవచ్చని.. అయితే ఇది సెకండ్ వేవ్ కన్నా తక్కువ తీవ్రతతో ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. అయితే దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ కేసుల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కవగానే ఉంటుందని.. ఈ పరిస్థితిని గమనిస్తున్నామని ఆయన అన్నారు.