భయం వద్దు.. ప్రస్తుతం థర్డ్‌వేవ్ లేదు: ఎక్స్‌పర్ట్స్

-

దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం, తొమ్మిది రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో థర్డ్‌వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్ వేవ్ రావడానికి ఆస్కారం లేదని, అనవసర భయాందోళనలు అవసరం లేదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. సోమవారం మహారాష్ట్రలో కొత్తగా రెండు కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తికి, అతడి స్నేహితుడు అమెరికా నుంచి 36 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. ఆ ఇద్దరికి కూడా ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, ఇద్దరు కూడా ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్నారని వైద్యాధికారులు తెలిపారు.

గత 10 రోజులుగా రాజస్తాన్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, మిజోరాంతోపాటు జమ్ముకశ్మీర్‌లో క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్-19 కేసుల పెరుగుదలకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని, కంటోన్మెంట్ జోన్లను విధించి కట్టడి చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. టెస్టింగ్ పెంచడం ద్వారా లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు గల కేసులు వెలుగులోకి రావడంతో కేసుల సంఖ్యలో పెరుగుద కనిపిస్తున్నట్లు ప్రజారోగ్య నిపుణులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్న సూచనలు కనిపించడం లేదని ప్యాండమిక్ మొదలైనప్పటి నుంచి కొవిడ్ కేసుల సంఖ్యపై పరిశోధన చేస్తున్నహెల్త్ ఎకనామిస్ట్ రిజో ఎం జాన్ అన్నారు. దేశంలో సెకండ్ వేవ్ వంటి దుర్భర పరిస్థితులు ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతుందన్న ఆందోళన అవసరం లేదని ఎపిడమాలజిస్ట్, హెల్త్ సిస్టమ్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు. ఒమిక్రాన్ గురించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొత్త వేరియంట్ గురించి భయాందోళనలు అవసరం లేదని తెలిపారు. దేశాన్ని అతలాకుతలం చేసే స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news