మళ్ళీ ముందస్తు ఎన్నికలు..ముహూర్తం ఫిక్స్?

-

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్ధులని చిత్తు చేసే వ్యూహాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు తిరుగులేదనే చెప్పొచ్చు. ప్రత్యర్ధులు కోలుకోకముందే దెబ్బకొట్టేస్తారు. అలా 2018లో ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి మరీ దెబ్బకొట్టారు. మామూలుగా 2014 జూన్‌లో అధికార పీఠంలోకి వచ్చిన కేసీఆర్‌కు, 2019 జూన్ వరకు సమయం ఉంటుంది. అంటే 2019 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాలి.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

కానీ కేసీఆర్ అదిరిపోయే వ్యూహంతో 2018 ఆఖరికి ప్రభుత్వాన్ని రద్దు చేసి, డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా సడన్‌గా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో ప్రతిపక్షాలకు అసలు ఛాన్స్ దొరకలేదు. అయితే నెక్స్ట్ కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2022 డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, 2023 మొదట్లో ఎన్నికలకు వెళ్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అందుకే గతంలో కాకుండా ఇప్పుడు ముందస్తు ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ శ్రేణులని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తన మాటలని కొందరు తప్పుబడుతున్నారని, ముందస్తు ఎన్నికలు రావని అంటున్నారని, కానీ ఇది నూటికి నూరు శాతం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అందుకు తగ్గట్టు కొన్ని లాజిక్‌లు కూడా చెబుతున్నారు. గతంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ముందే చెప్పానని, ఇప్పుడు అదే మాట చెబుతున్నానని, అలాగే ఈటలని పార్టీ నుంచి బయటకు పంపిస్తారని ముందే చెప్పానని అవే నిజమయ్యాయని అంటున్నారు.

ఇక అందరూ కేటీఆర్‌ని సీఎం చేస్తున్నారని మాట్లాడారని, కానీ తాను మాత్రం కేటీఆర్‌కు సీఎం పీఠం ఇప్పుడే ఇవ్వరని చెప్పానని అలాగే జరిగిందని, కాబట్టి 2023లో ముందస్తు ఎన్నికలు పక్కాగా జరుగుతాయని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. మరి రేవంత్ మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news