ఏపీ విద్యార్థులకు శుభవార్త…ప్రైవేటు స్కూళ్లలో 9వేల మందికి ఫ్రీ సీట్లు

-

ఏపీ విద్యార్థులకు శుభవార్త. రాబోయే విద్యా సంవత్సరానికి ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. 9,064 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపింది.

ఇప్పటికే వారి పేరెంట్స్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించామని పేర్కొంది. నేటి నుంచి 25వ తేదీ లోగా విద్యార్థులు వారికి కేటాయించిన స్కూళ్లలో చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

ఇక అటు ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులపై కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news