స్టేట్ బ్యాంక్ నుండి గుడ్ న్యూస్.. మళ్ళీ ఆ స్కీమ్… ఎన్నో లాభాలు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల స్కీములని తీసుకు వస్తూనే వుంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా కొన్ని స్కీమ్స్ ని తెస్తున్నారు. అలానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ని కూడా ఇస్తున్నాయి. స్కీమ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ స్కీం అమృత్ కలష్ డిపాజిట్.

దీనిలో చేరేందుకు గడువు 2023 మార్చి 31 తో పూర్తయ్యింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పింది. అందుకోసం ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌ సైట్‌ లో ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీం మళ్లీ తీసుకొచ్చారు. 400 రోజుల స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై ఏప్రిల్ 12 నుంచి 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది.

సీనియర్ సిటిజెన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర లాభం అంటే 7.60 శాతం వడ్డీ వస్తుంది. 2023, జూన్ 30 లోగా ఈ స్కీములో చేరచ్చు. మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు డబ్బులను పెట్టచ్చు. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ తెరిచే వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. అదే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకునే వారు కూడా చేరొచ్చు. వడ్డీ రేటు నెలవారీగా, 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news