గంటా రాజీనామా చేసి… వైకాపా క్యాండిడేట్ ని గెలిపించాలి!

-

గతకొన్ని రోజులుగా ఏపీలో వినిపిస్తోన్న మాట… ఎవరైనా టీడీపీ నాయకులు వైకాపాలో చేరాలంటే.. రాజినామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రావాలని! సరిగా గమనిస్తే ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? ఇప్పటికే గెలిచిన టీడీపీ నాయకుడు రాజినామా చేసి వైకాపా తరుపున పోటీచేస్తే… మరి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్న వైకాపా నేతలు ఏమి చేయాలి. వీరి వెనక జిందాబాద్ లు కొడుతూ తిరగాలా?

చాలామందికి అర్ధం కాని డౌట్ ఇది! రాజినామాలు చేసి రావాలి.. రాజినామాలు చేసి రావలి అంటుంటే… సరే సరే అంటారు, మంచి నిర్ణయం అని అభినందిస్తుంటారు! మరి ఇప్పటికే అక్కడున్న వైకాపా ఇన్ ఛార్జ్ పరిస్థితి ఏమిటి? అందుకే జగన్ ఒక ప్రణాళిక వేశారు.. సొంత బిడ్డ సొంత బిడ్డే అని భావించినట్లున్నారు! ఇందులో భాగంగా ఇంతకాలం తనను నమ్ముకుని.. తనతో ప్రయాణించి.. తనకు తోడుగా ఉంటూ గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు నష్టం జరగకుండా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు! ఆ ప్రాక్టికల్ కండిషన్ ని.. ప్రస్తుతానికి “వైకాపాలోకి వస్తా వస్తా ..” అంటున్న గంటా శ్రీనివాస్ పై అప్లై చేయబోతున్నారంట!

అవును… రాజినామా చేస్తే కాని గంటాకు వైకాపాలోకి వెళ్లే ఛాన్స్ లేదని గట్టిగా చెబుతున్నారు వైకాపా నేతలు. జగన్ సిద్ధాంతం కూడా అదే. లేదంటే, టీడీపీలోనే ఉంటూ వైకాపాకు జై కొడుతూ బాబుని మానసికంగా చిత్రవధ చేయడం! అయితే… గంటా మాత్రం రాజినామా చేసేసి, అధికారికంగా వైకాపా నేత అయిపోవాలని అత్యుత్సాహం చూపిస్తున్నారంట. అయితే… గంటా రాజినామా చేసిన అనంతరం విశాఖ నార్త్ జోన్ నియోజకవర్గం నుంచి గంటా చేతిలో పరాజయం పాలైన వైకాపా నేత కేకే రాజుని ఆ ఉప ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత కూడా పూర్తిచేయాలంట.

ఫలితంగా అధికారికంగా ఆ నియోజకవర్గం కూడా వైకాపా ఖాతాలో పడుతుంది. దాంతో.. గంటాకు ఒక నామినేటేడ్ పోస్ట్ ఇచ్చి కృతజ్ఞత తీర్చుకోనుందట అధికార పార్టీ! అయితే.. ఈ కండిషన్స్ కి గంటా ఒప్పుకున్నారని అంటున్నారు. వీలైనంత త్వరగా ఆయన రాజినామా చేసేసి.. వచ్చిన ఉప ఎన్నికల్లో కేకే రాజుని గెలవడంలో సహాయపడి.. అనంతరం అధికారింగా వైకాపా కండువా కప్పుకోనున్నారంట! “వైకాపాలోకి ఇతర పార్టీ నేతలు రావాలంటే ఇంత తతంగం ఉంటుంది మరి… వూరికే అధికారపార్టీలోకి రానిచ్చేస్తారు మరి… అక్కడున్నది బాబు కాదు జగన్” అనే మాటలు ఈ సందర్భంగా వినిపించడం కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news