పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. ప్రధాని మోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో ఎన్నో కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారన్నారు. ఏటా 2 కోట్ల మందికి ఆయన ఉద్యోగాలను అందిస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశారని.. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాంతో కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారని రాహుల్ గాంధీ అన్నారు.
రోజ్‌గార్ దో పేరిట రాహుల్ గాంధీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి అందుకు సంబంధించిన 90 సెకన్ల నిడివి గల ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. యువత ఉద్యోగాలు ఇవ్వాలని తమ గళాన్ని మోదీకి వినిపించాలని అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు, అనాలోచిత లాక్‌డౌన్ నిర్ణయాల వల్ల 14 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని మాట తప్పారని రాహుల్ అన్నారు.
देश के युवाओं के मन की बात:
रोज़गार दो, मोदी सरकार!आप भी अपनी आवाज़ युवा कॉंग्रेस के #RozgarDo के साथ जोड़कर, सरकार को नींद से जगाइये।
ये देश के भविष्य का सवाल है। pic.twitter.com/zOt6ng2T0M
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2020
మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోవడమే కాకుండా.. దేశ ఆర్థికవ్యవస్థ పతనమైందన్నారు. దేశంలో ఇక యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా రోజ్‌గార్ దో కార్యక్రమాన్ని చేపడతారని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వారు కృషి చేస్తారని.. రాహుల్ అన్నారు.