మంచి టూర్ వేసేయాలి మీరు అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా వివిధ టూర్ ప్యాకేజీలు ని IRCTC తీసుకు వచ్చింది. తక్కువ ధరలోనే ఈ ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులు చూసి రావచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మధ్య ప్రదేశ్ మహా దర్శన్ ప్యాకేజీ ని కూడా తీసుకు వచ్చింది. పూర్తి వివరాలు చూస్తే.. ఈ ప్యాకేజీ తో మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల ని చూసి రావచ్చు.
ఈ ప్యాకేజీ తో మహేశ్వర్, ఓం కారేశ్వర్, ఉజ్జయినీ దేవాలయలు కవర్ అవుతాయి. మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లలో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ పేరు వచ్చేసి మధ్య ప్రదేశ్ మహా దర్శన్(ఎస్ హెచ్ఏ15). విమానం లో వెళ్లి రావచ్చు. సెప్టెంబర్ 09 న ఈ టూర్ స్టార్ట్ అవ్వనుంది. ఉజ్జయినీ, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మొదటి రోజు తెల్లవారుజామునే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్టార్ట్ అవ్వాలి.
ఇండోర్ లో దిగాక, ఉజ్జయినీకి తీసుకెళ్తారు. ఇండోర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. హోటల్లో చెక్ అయ్యి, ఫ్రెష్ అయ్యాక అల్పాహారం ఇస్తారు. ఉజ్జయినీలో స్థానిక దేవాలయాల సందర్శన ఉంటుంది. ఇది అయ్యాక ఈ ప్యాకేజీ లో మనం హరసిద్ధి మాత టెంపుల్, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం ని చూడవచ్చు. అలానే మంగళనాథ్ టెంపుల్, చింతామన్ గణేష్ ఆలయాలకి వెళ్ళచ్చు. మహా కాళేశ్వర్ టెంపుల్ ని కూడా చూడొచ్చు. రెండవ రోజు ఉజ్జయినీ- ఓంకారేశ్వర్. అలానే మూడవ రోజు ఓంకారేశ్వర్-మహేశ్వర్- ఇండోర్. ఇండోర్-హైదరాబాద్ నాల్గవ రోజు. పూర్తి వివరాలని అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.