ఫ్యాక్ట్ చెక్: ఇస్రో సైంటిస్టులకు జీతాలు ఇవ్వట్లేదా..? నిజం ఏమిటి..?

-

సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి కనబడుతూనే ఉంటాయి. చాలా మంది నకిలీ వార్తలని నిజం అని భావిస్తూ ఉంటారు. వాట్సాప్ లలో కూడా నకిలీ వార్తలని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. నిజానికి నకిలీ వార్త ఏది..? నిజం ఏమిటి అనేది తెలుసుకోవాలి. లేదు అంటే మోసపోవాల్సి ఉంటుంది. అయితే ఏది నకిలీ వార్త ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోకుండా అనవసరంగా ఎప్పుడూ కూడా ఏ వార్తని ఇతరులకి షేర్ చేయకండి.

పైగా సోషల్ మీడియాలో ఈ మధ్య స్కీములంటూ ఉద్యోగాలంటూ ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా దానిలో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో సైంటిస్టులకు జీతాలు ఇవ్వట్లేదని మూడు నెలల నుండి ఇస్రో సైంటిస్టులకు జీతాలు అందలేదని వెల్లడించింది @tehseenp.

మరి అది నిజమా కదా అనే విషయాన్నికి వస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. సైంటిస్టులకు జీతం ప్రతినెలా ఇచ్చేస్తున్నారు ప్రతి నెల ఆఖరి రోజున సైంటిస్టులకు జీతాలు పడుతున్నాయట. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది. సైంటిస్టులకు జీతాలు ఇస్తున్నారని.. జీతాలు ఇవ్వట్లేదు అంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news