చాలా మంది దాల్చినని వంటల్లో వాడుతూ ఉంటారు. దాల్చిన తో వివిధ వంటలని తయారు చేసుకుంటూ ఉంటారు. బిర్యానీ వంటి వాటిల్లో కచ్చితంగా దాల్చిన ని వాడుతూ ఉంటారు. టీ వంటి వాటిల్లో కూడా దాల్చిన వేస్తారు. దాల్చిన మంచి ఫ్లేవర్ ని మాత్రమే ఇస్తుంది అనుకుంటే పొరపాటు. దాల్చిన వలన ఆరోగ్యనికి కూడా చాలా మంచిది. ఇక దాల్చిన వల్ల ఎటువంటి లాభాలను పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు దాల్చినని తీసుకోవడం వలన అజీర్తి సమస్యల మొదలు జలుబు వరకు ఎన్నో సమస్యలు దూరం అవుతాయి.
పొట్ట తగ్గుతుంది:
దాల్చిన చెక్క వలన పొట్ట కొవ్వు కరుగుతుంది చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు నిజానికి పొట్ట కొవ్వు ని సులభంగా తొలగిస్తుంది దాల్చిన. పొట్ట దగ్గర కొవ్వు కరిగించేందుకు దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్లలో వేసుకుని తీసుకుంటే చాలు. దీనిలో మీరు తేనె కూడా కలుపుకోవచ్చు.
ఆకలి ఉండదు:
అలానే దాల్చిన చెక్క ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీనితో అధిక బరువు సమస్య ఉండదు.
షుగర్ కంట్రోల్:
అలానే దాల్చిన ని తీసుకోవడం వలన చక్కెర స్థాయిలని కూడా కంట్రోల్ లో ఉంచుకోవడానికి అవుతుంది. దాల్చినను తీసుకుంటే జీవక్రియను కూడా వేగవంతం చేయొచ్చు. బరువు కూడా ఇలా తగ్గడానికి అవుతుంది.
అజీర్తి:
అజీర్తి సమస్యతో బాధపడే వాళ్ళు, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడే వాళ్ళు దాల్చిన చెక్క పొడి లో సొంటి యాలకులు సైంధవ లవణం కలిపి తీసుకుంటే ఈ బాధ ఉండదు. అలానే పాలల్లో కానీ నీళ్లల్లో కానీ అర చెంచా దాల్చిన చెక్క పొడిని వేసుకుని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. పొడపత్రి, నల్ల జీలకర్ర, దాల్చిన చెక్క, పసుపు సమానంగా కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిది. దాల్చిన తో జలుబు, దగ్గు కూడా తగ్గుతుంది.