నాగుపాము అనగానే జనాలు కొంత మంది భయపడిపోతుంటాం మనం చూడొచ్చు. అయితే, నాగుపామును పూజించడం గురించి మనకు తెలుసు. కానీ, అదే పాము ఇళ్లల్లో కనిపిస్తే మాత్రం ప్రాణ రక్షణ నిమిత్తం చంపే ప్రయత్నం చేస్తాం. కాగా, నాగు పాము విషానికి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. అది ఎంతో తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
నాగు పాము విషానికి స్థానిక మార్కెట్‌లో కంటే కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో బోలెడు డిమాండ్ ఉంది. అయితే, విలువ కలిగిన ఈ విషాన్ని తీయడం అంత ఈజీ కాదండోయ్. బతికి ఉన్న నాగుపామును చంపి మరీ విషం తీయాలి. ఇది కేవలం పాములు పట్టే వాళ్లతోనే సాధ్యం. అయితే, పాములు పట్టడమే వృత్తిగా పెట్టుకునే కొందరు మాత్రమే ఈ పనులు చేస్తారు. అనగా వారు పొట్టి కూటి కోసం విషపూరితమైన పాములను పట్టి వాటి నుంచి విషం తీస్తారు. నాగు పాముల విషం ధర స్థానికంగా లీటర్‌కు రూ.40 లక్షలు కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రూ.కోటికిపైనే ఉంటుందట. ఇకపోతే నాగుపాముల్లో రకరకాలున్నా మన రాష్ట్రంలో లభించే వాటి నుంచే విషం ఈజీగా తీయొచ్చట. పైగా అవి ఇక్కడ విరివిగా దొరకుతుండటం కూడా ఓ కారణం కావొచ్చు.
ఇక అప్పుడే పుట్టిన నాగుపాము పిల్ల నుంచి విషం సేకరించొచ్చు. విషపు గ్రంథులు చిన్న పాము పిల్లల్లో కూడా ఉంటాయి. ఇతర పాములతో పోలిస్తే నాగు పాము వెరీ డిఫరెంట్ ప్లస్ అట్రాక్టివ్ అనే చెప్పొచ్చు. అది పడగ విప్పుతున్న క్రమంలో చూస్తే ఆశ్చర్యం ప్లస్ ఒక రకమైన భయం కూడా వేస్తుంది. అయితే, పాములొళ్లు నాగుపాము నుంచి విషం సేకరణ క్రమంలో అవి వాటిపై కాటు వేసినా ఏం కాకుండా ఉండేందుకుగాను రక్షణగా నాగు పాము తల నుంచి తీసిన రాయి, నాగమల్లి వేరు పట్టుకుని ఉంటారు. దాంతో వారికి అస్సలు ఏం కాదు. ఇలా పాము విషం తీయడానికి గల కారణం మెడిసినల్ వాల్యూస్‌ను కలిగి ఉండటమే. ఈ పాము విషం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను ఇట్టే నయం చేయొచ్చని నిపుణులు పేర్కొంటుండటం విశేషం.