ఢిల్లీలో ఇటీవలే ఓ మహిళ రెస్టారెంట్ కు వెళ్లగా.. అక్కడ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ఆమెకు కనిపించారు. దీంతో వారిపై ఆ మహిళ అసభ్యకర కామెంట్లు చేసింది.
మన దేశంలో మహిళలు వేసుకునే డ్రెస్సులపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా నిర్భయ లాంటి ఘటనలు కొన్ని జరిగాక.. మహిళలు కురచ దుస్తులు వేసుకోరాదని, సాంప్రదాయ దుస్తులు ధరించాలని, మోడ్రన్ దుస్తులు ధరిస్తే వారిపై అత్యాచారం చేస్తారని.. పలువురు రక రకాల కామెంట్లు చేశారు. దీంతో పెద్ద ఎత్తున స్పందించిన ప్రజలు అలాంటి కామెంట్లు చేసే వారి నోళ్లను మూయించారు. అయినప్పటికీ ఎప్పుడూ ఎవరో ఒకరు మహిళల దుస్తులపై కామెంట్ చేస్తూనే ఉన్నారు.
ఢిల్లీలో ఇటీవలే ఓ మహిళ రెస్టారెంట్ కు వెళ్లగా.. అక్కడ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ఆమెకు కనిపించారు. దీంతో వారిపై ఆ మహిళ అసభ్యకర కామెంట్లు చేసింది. వారికి వినపడేట్లుగానే.. ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలను రేప్ చేయాలి.. అంటూ అక్కడున్న యువకులను రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడింది. దీంతో ఆమెను చుట్టు ముట్టిన అమ్మాయిలు ఆ మహిళ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే ఆ మహిళ అప్పుడు సారీ చెప్పలేదు కానీ.. తరువాత ఒకటి రెండు రోజులకు సారీ చెప్పింది. అయినా ఆ వివాదం ఇంకా సద్దుమణగనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ మహిళ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సేఫ్టీ అనే ఓ స్వచ్ఛంద సంస్థ యాంటీ రేప్ చీరల పేరిట కొన్ని ప్రత్యేకమైన చీరలను డిజైన్ చేసి వాటిని ఆన్‌లైన్ లో అమ్మకానికి పెట్టింది. https://www.sanskari-saree.com/ అనే సైట్‌లో యాంటీ రేప్ చీరలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ చీరలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే మహిళల దుస్తులపై కామెంట్లు చేస్తున్న వారికి కౌంటర్‌గానే ఇలాంటి దుస్తులను డిజైన్ చేశామని సదరు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీ చీరలకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది..!