షాదీ ముబారక్ క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాల‌కు నిధులు విడుద‌ల

-

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌కు నిధుల ను విడుద‌ల చేసింది. క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కం కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 462 కోట్ల 50 ల‌క్ష‌లను విడుదల చేసింది. అలాగే షాదీ ముబార‌క్ ప‌థ‌కం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 150 కోట్ల ను విడుద‌ల చేసింది. అలాగే దాని కి సంబంధించిన ఉత్త‌ర్వ‌ల‌ను కూడా జారీ చేసింది.

అయితే తెలంగాణ ప్ర‌భుత్వం క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థకాల‌ను 2014 నుంచి అమ‌లు చేస్తుంది. ఈ ప‌థ‌కం ద్వారా నూత‌నం గా పెళ్లి చేసుకున్న పెళ్లి కూత‌రు త‌ల్లి దండ్రుల‌కు రూ. 1,00,116 ల ను అందిస్తుంది. అయితే ఈ ప‌థ‌కాన్ని ఆర్థికంగా వెన‌క బ‌డిన కుటుంబాల‌కు మాత్ర‌మే ఈ న‌గ‌దు ను రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేయ‌నుంది. కాగ ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేయ‌డం తో ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి లు చేసుకున్న ఆర్థికంగా వెన‌క బ‌డిన కుటుంబాల‌కు ఈ న‌గ‌దు అంద నుంది.

Read more RELATED
Recommended to you

Latest news