2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తున్నారు.
పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తుక్కు విధానం గురించి ఆమె ప్రకటన చేస్తూ పొల్యూటెడ్ వెహికల్ అనబోయి.. పొలిటికల్ అని పలికారు. దీంతో అధికార సభ్యులతో పాటు, విపక్ష సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.
దీంతో ఒక్కసారిగా పార్లమెంటులో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పొరపాటును గ్రహించిన నిర్మలా సీతారామన్ సైతం నవ్వుతూ తప్పును సవరించుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.