GAAMI : అఘోరా గెటప్‌ లో వచ్చేసిన విశ్వక్‌ సేన్‌

-

టాలీవుడ్‌ మాస్‌ హీరో విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్‌ సేన్‌ మరొక సినిమాను అనౌన్‌ చేశాడు. ఈ సారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వేక్‌. ఇక ఈ సినిమా కు సంబంధించిన టైటిల్‌ ను అనౌన్స్‌ చేస్తూ… చిత్ర బృందం.. గ్లింప్స్‌ ను కూడా వదిలింది.

ఈ సినిమా కు ‘గామి’ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసిది. ఇక ఈ సినిమా కు సంబంధించిన విజువల్స్‌ అన్ని కూడా సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. అయితే.. ఈ గ్లింప్స్‌ లో మాత్రం విశ్వక్‌ సేన్‌ ను చూపించలేదు. విద్యాధర్‌ కాగిట ఈ సినిమా ను తెరకెక్కిస్తుండగా… వి సెల్యూలాయిడ్‌, కార్తీక్‌ శబరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే.. చాందీని చౌదరి మరియు అభినయ హీరోయిన్స్‌ గా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news