కాళేశ్వరంపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు, రేపు ధర్నాలకు పిలుపునిచింది బీఆర్ఎస్ పార్టీ. మండల మరియు జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు వివిధ రూపాల్లో నిరసన తెలుపనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ధర్నాలు,రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు ఇతర రూపాల్లో నిరసనలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ మేరకు పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపైన కుట్ర చేస్తున్నది.. తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలన్నారు. కేసీఆర్‌పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను ఒక్క రాష్ట్రాలకు తరలించి, కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది… సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేఅని వెల్లడించారు. నిన్నటిదాకా సీబీఐపైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు… దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేసారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు.