బిగ్ బాస్ గేమ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే నే చూసే మనం ఇక సెలబ్రిటీలు కొట్టుకుంటూ ఉంటే ఉండగలమా. అదే బిగ్ బాస్ షో కు రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం. ఇక గత సీజన్స్ తో పోల్చితే రేటింగ్స్ నీరసంగా ఉన్నాయి.దాన్ని పెంచడం కోసం బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు చేపిస్తున్నాడు.
దీని కోసం అందరూ ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నారు.వాస్తవానికి గత సీజన్లో ఎలిమినేట్ అయిన వారు, ప్రస్తుత సీజన్లో ఎలిమినేట్ అయిన వాళ్ళలో చాలా మంది చెప్పేది ఒక్కటే విషయం ఉంటుంది. అదేమిటంటే మేము హౌజ్ లో వున్నప్పుడు చేసిన వన్నీ చూపించరు, కేవలం బిగ్ బాస్ షో వారు ఏమి కావాలని అనుకుంటారో అది మాత్రమే చూపిస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అంటూ ఆరోపణ చేస్తూ ఉంటారు.
ఇక వారిలో ముందు వరుసలో వుండేది గలాటా గీతు. షో కు వెళ్ళ బోయే ముందు అన్ని రకాల బిగ్ బాస్ షోలు చూసి స్ట్రాటజీ బట్టీ పట్టి వచ్చి ఇక తనదే కప్ అని ఓవర్ యాక్షన్ చేసింది. ఇది చూడలేక ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. అయిన తర్వాత ఆమె వారం రోజులు బోరున ఏడ్చింది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తూ ఏడ్చిన ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.బిగ్ బాస్ తర్వాత డిప్రషన్ లో కి వెళ్లిందట.. అందుకే బయట కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ బయటకి వచ్చి నార్మల్ గా ఉంటోంది, రీసెంట్ గా కాలికి చిరుత టాటూ వేయించుకున్న అమ్మడు, అలాగే ఒక మా టీవి సీరియల్ కు ప్రమోషన్ వాయిస్ ఓవర్ ఇచ్చింది.