శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ వాచ్ 3 పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను, గెలాక్సీ బడ్స్ లైవ్ పేరిట నూతన వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను భారత్‌లో సోమవారం విడుదల చేసింది. వీటిల్లో అద్బుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. గెలాక్సీ వాచ్ 3లో ప్రత్యేకంగా ఈసీజీ సెన్సార్‌ను అందిస్తున్నారు. యాపిల్ వాచ్ లలో ఇచ్చిన మాదిరిగా ఈసీజీ సెన్సార్ పనిచేస్తుంది.
గెలాక్సీ వాచ్ 3 స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు…
* 1.4/1.2 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ డీఎక్స్ ప్రొటెక్షన్,
* డ్యుయల్ కోర్ ఎగ్జినోస్ 9110 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్
* టైజన్ ఆధారిత వియరబుల్ ఓఎస్ 5.5, యాక్సలరోమీటర్, ఈసీజీ సెన్సార్
* 5ఏటీఎం + ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.0, 4జీ ఎల్‌టీఈ
* ఎంఐఎల్-ఎస్టీడీ 810జి సర్టిఫైడ్ డ్యూరబిలిటీ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్
* ఆండ్రాయిడ్, ఐఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ చార్జింగ్
గెలాక్సీ వాచ్ 3కి చెందిన 41ఎంఎం బ్లూటూత్ మోడల్ ధర రూ.29,990 ఉంగా, 4జీ మోడల్ ధర రూ.34,490గా ఉంది. 45ఎంఎం బ్లూటూత్ మోడల్ ధర రూ.32,990 ఉండగా, 4జీ మోడల్ ధర రూ.38,990గా ఉంది. ఆగస్టు 27 నుంచి వీటిని విక్రయిస్తారు.
గెలాక్సీ బడ్స్ లైవ్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లో బ్లూటూత్ 5.0, 12 ఎంఎం డ్రైవర్ యూనిట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, వాటర్ రెసిస్టెన్స్, 6 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. వీటి ధర రూ.14,990గా ఉంది. ఆగస్టు 25 నుంచి లభిస్తాయి.