పంతం నెగ్గించుకున్న గంభీర్.. టీం ఇండియా బౌలింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా బౌలర్

-

ఇప్పటికే శ్రీలంక టూర్‌కు జట్టులో ఎంపికలో తన మార్క్‌ చూపించిన టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ గంభీర్..సహాయక సిబ్బంది విషయంలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడు.తాను సూచించిన వారినే కోచింగ్‌ స్టాఫ్‌లో భాగం చేయాలని బీసీసీఐని విజ్ఞప్తి చేశారు. బౌలింగ్‌ కోచ్‌ కోసం మోర్నీ మోర్కెల్, ఆర్‌.వినయ్ కుమార్,లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్‌ బీసీసీఐకి సూచించాడు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ”ఫార్మాలిటీస్‌ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అవి త్వరలో పూర్తవుతాయని ఆశిస్తున్నాము. శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నీ మోర్కెల్‌ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.

కాగా, మోర్కెల్‌, గంభీర్ గతంలో కలిసి ఆడారు. 2014లో కేకేఆర్ గంభీర్‌ సారథ్యంలో టైటిల్‌ సాధించింది. అప్పుడు మోర్నీ మోర్కెల్ కేకేఆర్‌ జట్టులో ఉన్నాడు. అంతేకాకుండా గంభీర్ లఖ్‌నవూకు మెంటార్‌గా ఉన్న సమయంలో మోర్కెల్ లఖ్‌నవూ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news