Game changer : గేమ్ చేంజర్ రిలీజ్…. దిల్ రాజ్ ఏమన్నారంటే…?

-

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తూ ఉన్నారు. ఈ చిత్రం యొక్క నిర్మాత దిల్ రాజు సలార్ చూడడానికి థియేటర్ వెళ్ళగా అక్కడ కొంతమంది అభిమానులు గేమ్ చేంజర్ ఎప్పుడు విడుదల అవుతుందని ప్రశ్నించారు. దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.దీనిపై రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించినటువంటి పొలిటికల్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news