హైదరాబాద్ మహానగరంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుతున్నాయి.బొజ్జగణపయ్య ఘనమైన పూజలు అందుకుంటున్నాడు. నగరంలోని అత్యంత భారీ వినాయకుడు ఖైరతాబాద్ గణేశ్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు.నేటితో గణపతి నవరాత్రుల్లో మూడు రోజులు పూర్తయ్యాయి. మరోవైపు ఇప్పటికే చిన్న గణపయ్యలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి.చవితి ప్రారంభమైన రెండో రోజు నుంచే నగరంలోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి.
అయితే, నేటి నుంచి జోరుగా నిమజ్జనాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో నేటి నుంచి ఈనెల 16వ తేదీవరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని నగర పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సెయిలింగ్ క్లబ్ టీజంక్షన్ నుంచి కర్బలామైదాన్ వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించడం లేదని తెలిపారు. వారంతా కవాడిగూడ వైపు టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.