గుంటూరులో దారుణం..భర్తను కొట్టిన భార్యపై గ్యాంగ్‌ రేప్‌

-

ఏపీలోని గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ గృహిణి పై గ్యాంగ్‌ రేప్‌ కు పాల్పడ్డారు కొందరు దుండగులు. భర్తను కొట్టి మరీ.. ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు.. గుంటూరు పట్టణంలో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మేడి కొండూరు క్రాస్‌ రోడ్‌ సమీపంలో ఈ దాడి జరిగింది.

బైక్‌ పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి ఆమె భర్తపై దాడికి దిగారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి.. గ్యాంగ్‌ రేప్‌ కు పాల్పడ్డారు. బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి… ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఇక ఘటన స్థలాన్ని పరిశీలించి… ఎట్టకేలకు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఏకంగా 10 మంది నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. వారినిపై ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news