Breaking : గణేష్ ఉత్సవాలపై హైకోర్టు ఆంక్షలు..!

-

గ‌ణేష్ ఉత్స‌వాలు మరియు నిమ‌జ్జ‌నంపై హైకోర్టు ఆంక్ష‌లు విధించింది. హుస్సేన్ సాగ‌ర్ లో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారు చేసిన విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయడానికి అనుమ‌తించ‌వ‌ద్దంటూ ఆదేశించింది. అంతే కాకుండా ఆ విగ్ర‌హాల‌ను కుంట‌ల్లో నిమ‌జ్జ‌నం చేయాలంటూ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా హుస్సేన్ సాగ‌ర్ లో ర‌బ్బ‌రు డ్యాం ఏర్పాటు చేసి అందులో విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయాలంటూ సూచించింది. మండపాల వ‌ద్ద ఎక్కువ మంది గుమిగూడ‌వ‌ద్దంటూ హైకోర్టు తెలిపింది.

ganesh festival
ganesh festival

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో గ‌ణేష్ ఉత్స‌వాల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా నేప‌థ్యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచిస్తోంది. మ‌రోవైపు ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం జీహెచ్ ఎంసీ ఏర్పాట్లు పూర్తిచేసింది. 55 క్రేన్ ల ద్వారా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు హుస్సేన్ సాగర్ లో రబ్బరు కొలను ఏర్పాటు చేయాలంటే సమయం స‌రిపోదని జీహెచ్ఎంసీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news