గంగ‌వ్వ‌ ఆర్మీ రచ్చ రచ్చ.. అప్పుడే ట్రెండింగ్..!

-

తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కూడా మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షో లో మొత్త 16 మంది కంటెస్టెంట్స్‌ ఎంట్రీ ఇచ్చారు. అలాగే బిగ్ బాస్ స్టేజ్‌పై కింగ్ నాగార్జున.. హౌస్‌లో ముసలి నాగార్జున తెగ సందడి చేశారు. ఇకపోతే బిగ్‌బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 16 మంది కంటెస్టెంట్స్‌ లో గంగ‌వ్వ ఒక‌రు.

మై విలేజ్ షో ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో దుమ్ము దులు‌పుతుంది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ ని ఇంట‌ర్వ్యూ చేసి నేష‌న‌ల్ మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. ఈ నేపథ్యంలో #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ గంగవ్వ ఆర్మీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. మరి రానున్న కాలంలో ఎన్ని ఆర్మీలు పుట్టుకొస్తాయో.. ఎంత రచ్చ చేస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news