ఇండియాలో కరోనా విజ్రుంభణ.. 90వేల+ కేసులు !

-

భారత్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రతి రోజూ ఎనభై వేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ప్రపంచ రికార్డులని ఇండియా కేసులు బద్దలలు కొట్టగా రోజు మళ్ళీ ఆ కేసులని మార్చేసింది. నిన్నటి కంటే మరో రెండు వందల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రోజు చేసే పరీక్షల సంఖ్య పెంచడంతో నమోదయ్యే కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగి పోతోంది.

coronavirus
coronavirus

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,802 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,016 మంది మరణించారు. ఇక నిన్నటిదాకా నమొదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 42 లక్షలను దాటింది. మొత్తం కేసుల సంఖ్య 42,04,614గా ఉంది. ఇక ఈ కేసులలో 8,82,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 32,50,429 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 71,642 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news