గురువారం రాత్రి అచ్చం సినిమాల్లో చూపెట్టుగా ఓ 16 మంది పోలీసుల టీమ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్యాంగ్ స్టర్ ముఠా పై అటాక్ కు వెళ్లింది ఆ విషయాన్ని ముందుగానే గమనించిన గ్యాంగ్ స్టర్ ముఠా పోలీసుల పై ఎదురుకాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ గ్యాంగ్ స్టర్ ముఠా అక్కడనుండి తప్పించుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. గ్యాంగ్ స్టర్ ముఠా వికాస్ దుబే ఆధ్వర్యం నడుస్తుంది ఈ ముఠా ఇప్పటికే చాలా అక్రమాల్లో పాలుపంచుకుంది. ఈ ముఠా పై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఆచూకీ చెప్పినా గ్యాంగ్ నాయకుడు వికాస్ దుబే ఆచూకీ చెప్పినా చెప్పినవారికి ప్రభుత్వం తరఫున 50 వేలు బహుమతిగా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఘటన జరిగిందని తెలుసుకున్న వికాస్ దేబె తల్లి సరళా రాణి తన కొడుకును పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేయాలంటూ డిమాండ్ చేసింది. తన కొడుకు ఇంత నీచానికి ఒదగడటాడని అస్సలు ఊహించలేదని ఆమె ఆనింది. తన కొడుకు కారణంగా 8 మంది పోలీసులు చనిపోయారని తన కొడుక్కి ఇకపై జీవించే హక్కు లేదని ఆమె పేర్కొంది. వికాస్ దుబే తల్లి నాలుగు నెలలుగా తన కుమారుడిని కలవలేదని అన్నారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కొడుకుతోనే లక్నోలో నివాసం ఉంటున్నానని తెలిపారు. మరణించిన పోలీసుల్లో డీఎస్పీ ఎస్సై సహా ఆరుగురు కానిస్టేబుల్స్ మరణించారు. పోలీసులు చేసిన కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్ సభ్యులు మరణించినట్టుగా తెలుస్తుంది.