దేశంలో ఓమిక్రాన్ విస్తరిస్తున్న వేళ జగన్ సర్కార్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర హోం శాఖ, WHO మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్కులు లేకుండా బయటకి వచ్చే వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు పాటించని వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా ఉన్నవారికి రూ.100 జరిమానా విధించాలని.. ఇదే శఇదంగా మాస్కు లేని వారిని దుఖాణాల్లోకి, వ్యాణిజ్య, వ్యాపార సముదాయాల్లోకి అనుమతిస్తే సదరు యాజమన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు 2 రోజుల పాటు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు పరచాలని ఆదేశించారు. ఎవరైనా కోరోనా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. ప్రజలు 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చునని ప్రభుత్వం సూచించింది. కావాలని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.