ఇదే ఊపులో ఐపీఎల్ 2024 కూడా కొట్టేయండి

-

ఐపీఎల్ టోర్నమెంట్లో దారుణంగా విఫలమవుతున్న సన్రైజర్స్ ఇతర టోర్నమెంట్లో మాత్రం బీభత్సంగా ఆడుతోంది. ఈ తరుణంలోనే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA 20 టోర్నమెంట్ లో సన్రైజర్స్ ఈస్టర్ణ కేప్ జట్టు మరోసారి కప్పు గెలుచుకుంది. దీంతో వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది సన్రైజర్స్. డర్బన్ సూపర్ జెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సునాయాసంగా గెలుపొంది రెండవసారి ఛాంపియన్ జట్టుగా నిలిచింది కావ్య పాపా టీం.

ఇదిలా ఉంటే….. వచ్చే ఐపీఎల్ ట్రోఫీని సన్ రైజర్స్ గెలుపొందాలని అభిమానులు కోరుతున్నారు. 2016లో జరిగిన ఐపీఎల్లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ టీమ్ గెలుపొందగా.. అప్పటి నుంచి మరో ట్రోఫీ దక్కలేదు. అయితే SA20 టోర్నీలో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంతో.. ఇదే ఊపులో 2024 IPLను సన్రైజర్స్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. మయాంక్, హెడ్ లాంటి స్టార్ ప్లేయర్లు టీమ్లో ఉండటంతో ఐపీఎల్ 2024 లో సన్రైజర్స్ గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news