గంజాయి లేడీ డాన్‌ సంగీత సాహు అరెస్ట్‌

-

గంజాయి లేడీ డాన్ సంగీత సాహు ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. పలు గంజాయి కేసుల్లో నిందితురాలిగా ఉన్న సంగీత గత కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతోంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై నగరంలో మొత్తం ఐదు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ నటి మాదిరిగా వీడియోలు పోస్టు చేస్తుంటుంది సంగీత సాహు.

ఒడిశాలోని కుర్థా జిల్లా కాళీకోట్‌ గ్రామానికి చెందిన సంగీత సాహు నాలుగేళ్ల క్రితం గంజాయి దందాలోకి దిగి.. అనేక రాష్ట్రాల గంజాయి వ్యాపారులకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి వాడకం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటుంది సంగీత. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె కోసం హైదరాబాద్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు ఒడిశా వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో తాజాగా ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు. నిందితురాలిని పట్టుకున్న ఎస్టీఎఫ్‌ పోలీసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news