తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోనే పోటీ చేయాలని ఉందని కుండ బద్దలు కొట్టారు. తన విశాఖ నార్త్ నుండి పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు విశాఖ నార్త్ లో వేరే ఇన్చార్జిని పెట్టమని తాను అదృష్టానికి సూచించినట్లు చెప్పారు.
తనని చీపురుపల్లి నుండి పోటీ చేయాల్సిందిగా టిడిపి అధిష్టానం ఆదేశించిందని అయితే తాను ఇంకా చీపురుపల్లి పై నిర్ణయం తీసుకోలేదని అన్నారు తన విశాఖపట్నం జిల్లాలోనే పోటీచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తనని విశాఖపట్నం జిల్లా నుండి వేరే ప్రాంతానికి పంపాలని అధిష్టానానికి అనుకుంటే అధిష్టానానికి తన అభిప్రాయాన్ని చెప్తానని అన్నారు.