ఆసక్తి రేపుతోన్న కేటీఆర్ తో గంటా భేటీ..

-

విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ తప్పదని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో బీజేపీ మినహా ఏపీలో మిగతా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఇలా అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. అయితే ఎవరూ ఊచించని విధంగా విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ తెలంగాణ మంత్రి కేటీఆర్ చర్చనీయాంశం అయ్యారు.

ఆయన దెబ్బకు చిరంజీవి లాంటి వాళ్ళు సైతం మద్దతు పలకాల్సి వచ్చింది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని గంటా చెబుతున్నారు. వైజాగ్ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం చెప్పేందుకు అక్కడికి రావాలని కేటీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి ఓ బృందంగా వైజాగ్ వస్తామని  కేటీఆర్ గంటాకు హామీ ఇచ్చినట్లు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Latest news